rakul preet singh actress in ntr movie
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmI649JJ8F3TItSWYqIxB8mEmZ3zjnPKGDllV9uTmRDD8ulFf2gUZ2ND7Hm3vK8xg8tCx1xup-H9IRUgAwzciRJwGNcpfUhRKxIPe5dgRrfM5fsX2JvJuwXcuc3bG53XEHVTkl4qGwhCI/s320/thu1532169517.jpg)
‘ఎన్టీఆర్’ చిత్రంలో కథానాయిక శ్రీదేవి పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందట. ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారామె. అందుకే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. అయితే ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయం ఆసక్తి రేకెత్తించింది. బాలీవుడ్ కథానాయికల్లో కొద్దిమంది పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజాగా రకుల్‌ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. రకుల్ కూడా తన అభిమాన కథా నాయికైన శ్రీదేవిగా నటించేందుకు ఆసక్తిగాఉన్నట్టు తెలిసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడైన బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటులతో పాటు, నవతరం తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తుండగా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. త్వరలోనే మర...