rakul preet singh actress in ntr movie
‘ఎన్టీఆర్’ చిత్రంలో కథానాయిక శ్రీదేవి పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందట. ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారామె. అందుకే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. అయితే ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయం ఆసక్తి రేకెత్తించింది. బాలీవుడ్ కథానాయికల్లో కొద్దిమంది పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజాగా రకుల్‌ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. రకుల్ కూడా తన అభిమాన కథా నాయికైన శ్రీదేవిగా నటించేందుకు ఆసక్తిగాఉన్నట్టు తెలిసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడైన బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటులతో పాటు, నవతరం తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తుండగా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. త్వరలోనే మరికొద్దిమంది తారలు ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశాలున్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్’లో శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు ముందుగా కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌లను సంప్రదించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారం గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి స్పష్టత ఇచ్చారట. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికతో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మేం సోనాక్షి, కంగన, శ్రద్ధలను కలవలేదు. రకుల్‌ప్రీత్ సింగ్ మా మొదటి ఎంపిక. ఆమెకు దక్షిణాదిలో చాలా పాపులారిటీ ఉంది. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ‘ఎన్టీఆర్’ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. విద్యా బాలన్ ఆరు రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రకుల్ డేట్స్ తీసుకునే పనిలో ఉన్నాం’ అని ఆయన చెప్పినట్లు రాశారు.
రకుల్ కూడా శ్రీదేవి పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె ప్రతినిధి అన్నట్లు తెలిసింది. ‘శ్రీదేవికి రకుల్ పెద్ద అభిమాని. కాబట్టి, ఈ పాత్రను ఇష్టపడి చేస్తున్నారు. కానీ, ఇంకా ఈ సినిమా పూర్తి వివరాలు ఆమె తెలుసుకోలేదు. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. మరోపక్క ఈ బయోపిక్‌కు డేట్స్‌ను కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నట్లు తెలిసింది.
‘ఎన్టీఆర్’లో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comments
Post a Comment