టిష్యూ పేపర్లతో వెడ్డింగ్‌ గౌన్‌ వర్జీనియా కళాకారుడి ప్రతిభ tissue paper wedding gown

కాదేదీ సృజనకు అనర్హం. అభిరుచి ఉండాలే కానీ, ఏ వస్తువుతోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని అని నిరూపించాడో కళాకారుడు. ఎందుకూ పనికిరాని వస్తువులే మరికొందరికి ‘కళా’వస్తువుగా పనికి రావచ్చు. అందులో టిష్యూ పేపర్లు కూడా ఒకటి. సాధారణంగా కాస్త గట్టిగా పట్టుకుంటేనే ముక్కలు, ముక్కలుగా చిరిగిపోయే టిష్యూతో వస్తువులు తయారు చేయడం సాధ్యమేనా... కానీ వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం దానితో ఏకంగా వెడ్డింగ్‌ గౌనే డిజైన్‌ చేశాడు.. అంతేనా అందుకు గానూ బంపర్‌ ప్రైజ్‌మనీ కూడా సొంతం చేసుకున్నాడు.

వర్జీనియాకు చెందిన రోయ్‌ క్రూజ్‌ అనే డిజైనర్‌ టిష్యూ పేపర్‌తో చూడచక్కని వెడ్డింగ్‌ గౌన్‌ డిజైన్‌ చేశారు. దీనికి ఆయన ఉపయోగించిందల్లా టాయిలెట్‌ పేపర్(టిష్యూ పేపర్‌), గ్లూ, టేప్‌, సూది, దారం మాత్రమే. టాయిలెట్‌ పేపర్‌ వెడ్డింగ్‌ డ్రెస్‌ పోటీల్లో తాను డిజైన్‌ చేసిన వెడ్డింగ్‌ డ్రెస్‌ను ప్రదర్శించి 10,000 డాలర్ల భారీ ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. ఆయన తయారు చేసిన డిజైన్‌ దుస్తులతో ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ పోటీల్లో పాల్గొనగా... నాలుగు సార్లు ఈయనే విజేత. ప్రతిసారి కొత్త కాన్సెప్ట్‌తో దుస్తులు తయారు చేసే ఈయన.. ఈ సారి కాస్త వినూత్నంగా ఆలోచించి టిష్యూ పేపర్లతో డ్రెస్‌ తయారు చేయడంతో అందరి చూపును తన వైపు తిప్పుకొన్నాడు.

28రోల్‌ల టిష్యూ పేపర్లను ఉపయోగించి కొన్నిగంటలపాటు శ్రమించి ఆయన ఏ-లైన్‌ టూపీస్‌ ఫ్లోర్‌ లెంగ్త్‌ గౌన్‌ను తయారు చేశాడు. లైన్‌ఫెల్డ్‌ బ్రైడల్‌ బొటిక్‌ పేరుతో న్యూయార్క్‌లో బొటిక్‌ నడుపుతున్న క్రూజ్‌.. ఇంతకు ముందు గవ్వలు, మొక్కజొన్న, ఎండిన పూలతో దుస్తులు తయారు చేశాడు.

Comments

Popular posts from this blog

Jokae Song with Lyrics | KGF Kannada | Yash | Tamannaah | Prashanth Neel...